Hanu-Man పాన్ ఇండియా మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,January 09,2023 - 03:35 by Z_CLU

 క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ హను-మాన్ నుండి టాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన హను మాన్ టీజర్ ఇంటర్నేషనల్ వైడ్ గా రాంపేజ్ క్రియేట్ చేసింది. మెస్మరైజింగ్ విజువల్స్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.

 HANU-MAN మే 12, 2023న వేసవిలో తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ గా ఈ సినిమా రిలీజవుతుంది. హనుమంతుడి బొట్టు రంగుతో మ్యాప్‌ చూపిస్తూ బ్యాక్ గ్రౌండ్ లో శ్రీ ఆంజనేయ స్తోత్రంతో వినిపించే  అనౌన్స్‌మెంట్ వీడియో క్యూరియాసిటీ రైజ్ చేస్తుంది. హను-మాన్ యొక్క సామ్రాజ్యంగా ఈ సినిమాను విడుదల చేయడానికి దేశాలను చూపించే ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వీడియో మంచి ఇంపాక్ట్ కలిగిస్తుంది.