Shaakuntalam: శాకుంతలం మూవీ ట్రయిలర్ రివ్యూ

Monday,January 09,2023 - 03:32 by Z_CLU

సమంత (Samantha) నటించిన ‘శాకుంతలం’ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు.

ఈరోజు మేకర్స్ గ్రాండ్ గా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

రెండున్నర నిమిషాల రన్ టైమ్ ఉన్న ట్రైలర్‌లో (Shaakuntalam Trailer) మేనక, విశ్వామిత్రల కుమార్తె శకుంతల అని.. దుష్యంతుడు ఆమెను ప్రేమించడం, వాళ్ల మధ్య రొమాన్స్ తో ట్రయిలర్ ను ప్రారంభించారు.

ట్రయిలర్ లో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అలా గ్రాండ్ గా మొదలైన ట్రయిలర్ శకుంతల పాత్ర గర్భం దాల్చడం, తను మోసపోయానని గ్రహించడం లాంటి ట్విస్టులతో సాగింది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ ఆకట్టుకున్నారు.

సినిమాలో ఇతర పాత్రధారుల్ని కూడా ట్రయిలర్ లో పరిచయం చేశారు. అనన్య నాగళ్ల, గౌతమి, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు పాత్రల్ని ట్రయిలర్ లో టచ్ చేశారు. ఇక చివర్లో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హను సింహంప కూర్చొని కదిలివచ్చేలా చూపించారు.

సినిమా ఓ విజువల్ ఫీస్ట్ గా ఉండబోతోందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.