Prabhas Salaar - మరోసారి బాహుబలి రూట్లో ప్రభాస్

Wednesday,June 23,2021 - 01:51 by Z_CLU

ప్రస్తుతం ప్రాంచైజీ సిరీస్ నడుస్తుంది. ఒక సినిమాను రెండు బాగాలుగా తీయదానికి ఫిలిం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి ప్రాంచైజీతో రాజమౌళి ఈ ట్రెండ్ కి ఊపు తీసుకురావడంతో ప్రస్తుతం టాప్ దర్శకులు కూడా అదే దారిలో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ‘పుష్ప’ రెండు భాగాలుగా తెరకెక్కనుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ లిస్టులో ప్రభాస్ సలార్ కూడా జాయిన్ అయింది. KGF తో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తీస్తున్న సలార్ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది.

prabhas SALAAR_Release-poster-zeecinemalu

ప్రభాస్ కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పక్కా మాస్ కథ రెడీ చేశాడు ప్రశాంత్ నీల్. కథ మీద , ప్రశాంత్ నీల్ టేకింగ్ మీద నమ్మకంతో చేస్తున్న ప్రాజెక్ట్స్ పక్కన పెట్టి మరీ సలార్ ను ముందుకు తీసుకొచ్చాడు ప్రభాస్. ఇప్పుడు ఆ నమ్మకంతో ప్రశాంత్ నీల్ చెప్పిన ప్రాంచైజీ ఆలోచనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రభాస్. ప్రస్తుతానికి మేకర్స్ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. కథను రెండు భాగాలుగా తీయడాన్ వలన రెండో భాగంపై ఎలాంటి అంచనాలు నెలకొంటాయి ? అని మార్కెటింగ్ పరంగానూ ఆలోచిస్తున్నారట నిర్మాతలు.

prabhas_salaar

ఫైనల్ డిస్కషన్ లో అందరూ ఓకె అంటే సలార్ రెండు పార్ట్స్ గా రావడం ఖాయం. పాన్ ఇండియా స్టార్ గా బాహుబలి ప్రాంచైజీతో ఎవరూ అందుకోలేని రికార్డులు సృష్టించిన ప్రభాస్ కాబట్టి సలార్ కూడా ఫ్రాంచైజీ గానే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే ఈ విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రానుంది. అప్పటి వరకు ఈ ప్రచారంపై కొన్ని సందేహాలు నెలకొంటాయి. మరి మేకర్స్ నుండి సలార్ రెండు పార్ట్స్ పై క్లారిటీ వచ్చేదెప్పుడో ?

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics