HERO Teaser - ఆకట్టుకున్న మహేష్ అల్లుడు

Wednesday,June 23,2021 - 02:02 by Z_CLU

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి రమేష్ బాబు, మహేష్ లతో పాటు సుదీర్ బాబు కూడా హీరోగా పరిచయమై సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. కృష్ణ మనవడు మహేష్ అల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ టీజర్ వదిలారు మేకర్స్. మహేష్ ఈ టీజర్ లాంచ్ చేసి అశోక్ అండ్ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

హీరో అనే టైటిల్ తో పాటు టీజర్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ముఖ్యంగా టీజర్ ఆరంభంలో అశోక్ కౌ బాయ్ గెటప్ లో ట్రైన్ ఎపిసోడ్ కి సంబంధించి షాట్స్ ఘట్టమనేని ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ గెటప్ తో అశోక్ ఫ్యాన్స్ కి మోసగాళ్ళకు మోసగాడు లో కృష్ణను, టక్కరి దొంగలో మహేష్ ని గుర్తు చేశాడు. అలాగే సినిమాలో యాక్షన్ , లవ్ , ఫన్ అన్నీ ఉంటాయని క్లిప్స్ తో చెప్పకనే చెప్పారు మేకర్స్. అలాగే మొదటి సినిమాతోనే అశోక్ కి కొన్ని వేరియేషన్స్ చూపించే మంచి క్యారెక్టర్ దొరికిందని అర్థమైతుంది. సినిమాలో జోకర్ గెటప్ తో వచ్చే సన్నివేశాలు అతనిలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని చూపించేలా ఉంటాయని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇక టీజర్ కి జిబ్రాన్ ఇచ్చిన స్కోర్ హైలైట్ గా నిలిచింది.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బేనర్ పై పద్మావతి నిర్మిస్తున్నారు. త్వరలోనే అశోక్ గల్లా ‘హీరో’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics