Adipurush ప్రభాస్ ఫస్ట్ లుక్ ఆరోజే ?

Saturday,April 02,2022 - 11:18 by Z_CLU

Buzz : Prabhas’s ‘Adipurush’ firstlook on April 10th

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆది పురుష్’ సినిమా నుండి ఓ  అప్ డేట్ బయటికొచ్చింది. ఇప్పటి వరకూ ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి సంబంధించి ఎలాంటి స్టిల్ రిలీజ్ చేయలేదు మేకర్స్. ఇప్పుడు ప్రభాస్ ఫస్ట్ లుక్ కి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 10 న శ్రీరామ నవమి కానుకగా ప్రభాస్ రాముడు గెటప్ లో ఉండే స్టిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

‘ఆదిపురుష్’ రామాయణంలో ప్రథమ ఘట్టాల ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.  ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ స్కోప్ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైం తీసుకుంటున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాకు సంబంధించి శ్రీరామనవమి నుండి ప్రమోషన్ మొదలు కానుంది. ఐదు భాషల్లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics