MaheshBabu Rajamouli Movie 800 కోట్ల బడ్జెట్ నిజమెంత ?

Saturday,April 02,2022 - 10:10 by Z_CLU

Mahesh Babu , Rajamouli’s film Budget becomes the hot topic

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా థియేటర్స్ లో సందడి చేస్తూ భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. అయితే  ఉన్నపళంగా జక్కన్న నెక్స్ట్ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబో సినిమాకు నిర్మాత కే ఎల్ నారాయణ 800 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టనున్నారని టాక్ స్ప్రెడ్ అవుతోంది.

నిజానికి ఈ బడ్జెట్ మేటర్ లో నిజం లేదు. అవును ప్రస్తుతానికి మహేష్ సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ లాక్ అవ్వలేదు. ఆఫ్రికా అడవుల నేపథ్యంతో ఏదైనా కొత్తగా ట్రై చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడు. త్వరలోనే తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టనున్నాడు జక్కన్న. ఇంకా స్క్రిప్ట్ లాక్ అవ్వకుండానే  ఈ సినిమాకు బడ్జెట్ ఎలా డిసైడ్ అవుతుంది ? రాజమౌళి సినిమా అంటే రెండొందల కోట్లకు పైనే బడ్జెట్ ఉంటుంది అది మాత్రం పక్కా. కానీ మరీ 800 కోట్ల బడ్జెట్ అంటే మాత్రం నమ్మశక్యంగా లేదు.

గతంలో హీరో మహేష్ కి అలాగే దర్శకుడు రాజమౌళి కి తమ బేనర్ లో సినిమా చేయమని అడ్వాన్స్ ఇచ్చాడు కే ఎల్ నారాయణ. ఇప్పుడు మహేష్ , రాజమౌళి కలిసి ఆయనకి సినిమా చేసి పెడుతున్నారు. ఈ క్రేజీ కాంబో సినిమాకు నిర్మాత ఏ మాత్రం కంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టడం ఖాయం కానీ స్క్రిప్ట్ లాక్ అయ్యాకే నిజమైన బడ్జెట్ ఎంతో తెలియనుంది. అప్పటి వరకూ ఈ సినిమా బడ్జెట్ పై రకరకాల న్యూస్ లు చక్కర్లు కొట్టడం కామనే.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics