HOT Topic - ప్రభాస్-రామ్ చరణ్ మల్టీ స్టారర్?

Friday,August 27,2021 - 07:36 by Z_CLU

ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి ‘RRR’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ మల్టీ స్టారర్ తర్వాత మరో మల్టీ స్టారర్ కూడా రాబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ డెబ్యు డైరెక్టర్ వీరిద్దరి కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసి యూ.వీ నిర్మాతలకు చెప్పాడట. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పై డిస్కషన్స్ నడుస్తున్నాయని త్వరలోనే ఈ క్రేజీ కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినబడుతుంది.

ramcharan new stills zeecinemalu

యూ.వీ.క్రియేషన్స్ లో రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఎప్పటి నుండో ఆ నిర్మాతలు చెర్రీతో సినిమా నిర్మించాలని చూస్తున్నారు. ఒకటి రెండు కథలు కూడా అనుకున్నారు. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇక ఈ బేనర్ లో సుజీత్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇంతలోనే యూ.వీ క్రియేషన్స్ లో ప్రభాస్ , రామ్ చరణ్ మల్టీ స్టారర్ అంటూ ఓ న్యూస్ స్ప్రెడ్ అయింది.

ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాలు సైన్ చేసి వాటి షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడప్పుడే ప్రభాస్ డేట్స్ దొరకని పరిస్థితి. ప్రభాస్ డేట్స్ కావాలంటే ఇంకా రెండేళ్ళు పడుతుంది. ఇక రామ్ చరణ్ కూడా శంకర్ తో భారీ సినిమా చేయబోతున్నాడు. దాదాపు ఏడాదిన్నర పైనే చరణ్ కూడా బిజీ. ఆ తర్వాత నిర్మాత NV ప్రసాద్ బేనర్ కి ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

prabhas birthday special zeecinemalu 4

మరి ప్రభాస్ , రామ్ చరణ్ తమ కమిట్ మెంట్స్ పూర్తయ్యాక ఈ మల్టీ స్టారర్ చేస్తారా? లేదంటే ఇది కేవలం ఓ గాసిప్ గా ఉండిపోతుందా? చూడాలి. ఏదేమైనా ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే ఇద్దరి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics