Yash Telugu Movie: KGF హీరోతో బోయపాటి సినిమా?

Friday,August 27,2021 - 07:41 by Z_CLU

ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. KGF హీరో యష్ తో బోయపాటి శ్రీను ఓ మాస్ యాక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనేది ఆ న్యూస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘KGF’ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమాతో రాత్రి కి రాత్రి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యష్. తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు.

దాంతో యష్ కి తెలుగులో ఫ్యాన్స్ పుట్టుకుచ్చారు. అందుకే యష్ డైరెక్ట్ గా తెలుగులో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇక అదే సమయంలో బోయపాటి యష్ కి ఓ మాస్ కమర్షియల్ కథను నెరేట్ చేసాడని టాక్. స్క్రిప్ట్ యష్ కి బాగా నచ్చిందని అలాగే బోయపాటి మాస్ సినిమాలను చూసి యష్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. వినయ విధేయ రామ సినిమాకి ముందు బోయపాటి రామ్ చరణ్ కి చెప్పిన ఓ కథనే ఇప్పుడు యష్ కి వినిపించాడనే ప్రచారం జరుగుతుంది. బోయపాటి పక్కా మాస్ డైరెక్టర్ అతనికి యష్ లాంటి హీరో పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కథలో దమ్ము ఉండాలి కానీ ఈ కాంబో భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం.

ప్రస్తుతం బాలయ్య మూడో సినిమా చేస్తున్నాడు బోయపాటి. అఖండ షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెడతాడు బోయపాటి. మరి బోయపాటి నెక్స్ట్ సినిమా యష్ తోనే ఉంటుందా ? ఈ మాస్ క్రేజీ కాంబో సినిమా ఎప్పుడు పట్టలెక్కుతుంది ? తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ కాంబో సినిమాపై క్లారిటీ రానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics