ఇండియాలో ల్యాండ్ అయిన ప్రభాస్

Saturday,November 07,2020 - 06:01 by Z_CLU

రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్.. ఆ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. ఈరోజు ముంబయిలో ల్యాండ్ అయ్యాడు. హైదరాబాద్ రాకుండా, ముంబయిలో ల్యాండ్ అవ్వడానికి ఓ రీజన్ ఉంది.

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి మేకర్స్ తో చర్చలు జరుపుతాడు ప్రభాస్. కాల్షీట్ల సర్దుబాటుతో పాటు మరికొన్ని వ్యవహారాల్ని పూర్తిచేసి హైదరాబాద్ వస్తాడు.

ఆదిపురుష్ ను జనవరి నుంచి స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. జనవరి నుంచి ఏకథాటిగా 3 నెలల పాటు ఆదిపురుష్ షూటింగ్ చేయబోతున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమాను స్టార్ట్ చేస్తాడు.

ఇక రాధేశ్యామ్ విషయానికొస్తే.. ఈ సినిమాకు సంబంధించి ఇంకొక్క చిన్న షెడ్యూల్ మాత్రం బాకీ ఉంది. హైదారాబాద్ లోనే వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఆ సినిమాను పూర్తిచేయబోతున్నాడు ప్రభాస్.