పూజా హెగ్డే కెరీర్ లో బిగ్ మూవీ

Tuesday,February 11,2020 - 04:45 by Z_CLU

తెలుగులో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తూనే బాలీవుడ్ లో కూడా మూవీస్ చేస్తోంది పూజా హెగ్డే. నిజానికి ఆమె కళ్లు ఎప్పుడూ బాలీవుడ్ పైనే. ఎట్టకేలకు తను అనుకున్నది సాధించింది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో బిగ్ మూవీ ఛాన్స్ అందుకుంది. సల్మాన్ ఖాన్ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది.

అవును.. కండలవీరుడు సల్మాన్ కొత్త సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా సెలక్ట్ అయింది. ఇదేదో నలుగురిలో ఒక హీరోయిన్ టైపు కాదు. సినిమాలో సోలో హీరోయిన్. నిజంగా పూజా హెగ్డే కు ఇది బాలీవుడ్ బిగ్ ఆఫర్ మాత్రమే కాదు, ఆమె కెరీర్ లోనే అతిపెద్ద ఆఫర్.

హౌజ్ ఫుల్-4 ఫేమ్ ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎఁటర్ టైనర్ చేయబోతున్నాడు సల్మాన్. ఇందులో హీరోయిన్ గా పూజాను తీసుకున్నారు. దీనికి కభీ ఈద్-కభీ దివాళీ అనే టైటిల్ అనుకుంటున్నారు. సాజిద్ నడియావాలా నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే టాప్ లీగ్ లోకి ఎంటరైపోతుంది.