ప్రభాస్ సినిమాలో పూజా హెగ్డే

Monday,March 12,2018 - 11:01 by Z_CLU

మొన్నటివరకు ఇది రూమర్ మాత్రమే. కానీ ఇప్పుడిది అఫీషియల్. అవును.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మెరవనుంది పూజా హెగ్డే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎనౌన్స్ చేసింది.

దువ్వాడ జగన్నాధమ్ హిట్ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఇప్పుడు ప్రభాస్ మూవీ అవకాశం కూడా ఈమెకే దక్కింది.

కుదిరితే ఈనెలలోనే కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడు ప్రభాస్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై రాబోతోంది ఈ మూవీ. ఈ సినిమాలోనే హీరోయిన్ గా ఎంపికైంది పూజా హెగ్డే.

సాహో సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రభాస్ సొంత సినిమా. ఎందుకంటే ప్రభాస్ పెదనాన్న కృష్ణరాజుకు చెందిన బ్యానర్ ఇది.