Pawan Rana Movie - మార్పులతో రీమేక్?

Wednesday,June 30,2021 - 05:36 by Z_CLU

పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. సినిమాలో నాలుగు ఫైట్లు ఉన్నాయనేది ఆ అప్ డేట్. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసారట. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ కూడా అందిస్తున్నాడు.

pawan rana movie zeecinemalu

స్క్రిప్టింగ్ స్టేజిలోనే పవన్ క్యారెక్టర్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేసి అందులో ఓ భారీ ఫైట్ కూడా పెట్టారట త్రివిక్రమ్. అలాగే సినిమాలో మరో మూడు ఫైట్లు ఉంటాయని టాక్. ఇలా నాలుగు ఫైట్లు , ఫ్లాష్ బ్యాక్ తో ఒరిజినల్ కథను కాస్త అటు ఇటుగా మార్చి ఈ సినిమాను తీస్తున్నారట. ఇటివలే వకీల్ సాబ్ లో కూడా ఇలాంటి మార్పులే చేశారు. సినిమా చూశాక పింక్ కి వకీల్ సాబ్ కి పోలికే లేదు కేవలం కథ తప్ప అని ఆడియన్స్ నుండి కాంప్లిమెంట్స్ వచ్చాయి. దర్శకుడు శ్రీరామ్ వేణు ఆ సినిమాలో చేసిన మార్పులకు పెట్టిన ఫైట్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ అండ్ టీం కూడా అందుకే ఈ సినిమాలో అలాంటి మార్పులు చేస్తూ పవన్ అభిమానులను మెప్పించేలా తెరకెక్కిస్తున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకుడు. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. సాయి పల్లవి తో పాటు మరికొందరి పేర్లు వినబడుతున్నాయి. డీ అంటే డీ అనే ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics