Chatrapathi Remake - రెడీ అవుతుంది!
Wednesday,June 30,2021 - 05:20 by Z_CLU
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా మొదటి షెడ్యుల్ కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేశారు. ఇటివలే వర్షాల కారణంగా ఆ సెట్ డ్యామేజ్ అయింది. మళ్ళీ రీ-వర్క్ మొదలు పెట్టి సెట్ పూర్తి చేస్తున్నారు. దాదాపు వర్క్ ఫినిష్ అయింది. ఆ భారీ సెట్ లో మొదటి షెడ్యుల్ జరపనున్నారు.
జులై మొదటి వారం నుండి సెట్ లో షూటింగ్ కానుందని సమాచారం. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారని తెలుస్తుంది. దాదాపు ఇరవై రోజుల పాటు ఈ షెడ్యుల్ జరగుందని అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు ఇంకా ఆర్టిస్టులను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు వినాయక్. సినిమాలో శ్రీనివాస్ కి హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బాలీవుడ్ నుండి హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. మరికొంతమంది హిందీ నటులను కూడా తీసుకోనున్నారు. సినిమాలో శ్రీనివాస్ మదర్ రోల్ కి కూడా ఇంకా ఆర్టిస్ట్ ఫైనల్ అవ్వలేదు. అలాగే సినిమాలో మరో కీలకమైన తమ్ముడు క్యారెక్టర్ కూడా ఉంది.
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఛత్రపతి’ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు ప్రభాస్. అందుకే తన బాలీవుడ్ డెబ్యు కోసం ఏరి కోరి మరీ ఈ రీమేక్ ను ఎంచుకున్నాడు శ్రీనివాస్. మరి మాస్ ఆడియన్స్ ని భీభత్సంగా ఎట్రాక్ట్ చేసే యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించే ఎమోషనల్ టచ్ ఉన్న ఛత్రపతి కథతో బెల్లంకొండ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics