హాట్ టాపిక్: పవన్ చేతికి డ్రైవింగ్ లైసెన్స్

Thursday,May 14,2020 - 04:21 by Z_CLU

ఇప్పటికే పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. అయితే పవర్ స్టార్ వీటితో ఆగడం లేదు. రాబోయే మూడేళ్లలో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ రీమేక్ పవన్ దగ్గరకొచ్చి ఆగింది.

మలయాళంలో రీసెంట్ గా సూపర్ హిట్టయిన సినిమాల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి. పృధ్విరాజ్ హీరోగా నటించిన ఈ సినిమా పవర్ స్టార్ కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా కథ అలాంటిది మరి.

సినిమాలో హీరో నిజంగానే ఓ స్టార్ హీరో. అతడి కోసం ప్రాణమిచ్చే ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ లో ఒకడు అదే ఊరిలో పనిచేస్తున్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్. అయితే అనుకోని విధంగా సదరు స్టార్ హీరోకు, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ కు మధ్య ఘర్షణ చెలరేగుతుంది. ఫైనల్ గా ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ.

ఇందులో పృధ్విరాజ్ పోషించిన రీల్ లైఫ్ స్టార్ హీరో పాత్ర.. పవర్ స్టార్ కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. అందుకే ఓ బడా నిర్మాత ఈ ఆఫర్ ను పవన్ ముందుంచాడు.

కాకపోతే పవన్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వకీల్ సాబ్ రిలీజై, క్రిష్ మూవీ కొలిక్కి వచ్చిన తర్వాత ఆలోచిద్దామని చెప్పి పంపించారట. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదే హాట్ టాపిక్.