రవితేజ కూడా రెడీ!

Thursday,May 14,2020 - 04:04 by Z_CLU

లాక్ డౌన్ పూర్తయిన వెంటనే సినిమా షూటింగ్ లపై ఓ క్లారిటీ రానుంది. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం షూటింగ్స్ కి పర్మిషన్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే నాని, సుధీర్ బాబు ‘V’, తో పాటు ‘ఉప్పెన’ , 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?’ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వీటితో పాటే రవితేజ సినిమా ‘క్రాక్’ కూడా విడుదలకి ముస్తాబవుతుంది. అవును… క్రాక్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో వైపు ఆర్ఆర్ వర్క్ జరుగుతుంది.

కేవలం ఓ 10 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. షూటింగ్ కి పర్మిషన్ రాగానే బ్యాలెన్స్ షూట్ ను ఫినిష్ చేసి జెట్ స్పీడ్ లో రిలీజ్ కి రెడీ చేసే పనిలో ఉన్నారు. సో… ఈ లెక్కన చూస్తే థియేటర్స్ ఓపెన్ అయిన కొన్ని రోజులకే రవితేజ క్రాక్ కూడా రిలీజ్ కు రెడీ అన్నమాట.