షూటింగ్ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్

Sunday,July 05,2020 - 03:18 by Z_CLU

అన్నీ అనుకున్నట్లు జరిగితే పవన్ కళ్యాణ్ -క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఈ పాటికి సగం పూర్తవ్వాలి. కానీ కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వం షూటింగ్ కి పర్మీషన్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు పవన్ తో ఓ మీటింగ్ పెట్టుకొని డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్.

ఆగస్టు నెలాఖరు నుండి క్రిష్-పవన్ సినిమా సెట్స్ పైకి రానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ కోసం ఓ సెట్ రెడీ చేస్తుంది ఆర్ట్ డిపార్ట్ మెంట్. ఈ షెడ్యుల్ ని లిమిటెడ్ టెక్నీషియన్స్ తో షూట్ చేసేలా క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.

నటీనటులు తప్ప సెట్ లో ఎక్కువ మంది ఉండకుండా జాగ్రత్త వహించనున్నారు. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ సినిమాకు ‘విరూపాక్షి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.