ఐటెం సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ

Sunday,July 05,2020 - 03:12 by Z_CLU

 

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను పాయల్ చేయనుందని, ఆ సాంగ్ కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఐటెం గర్ల్ గా కొందరు హీరోయిన్స్ పేర్లు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అందులో పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది.

పుష్ప లో పాయల్ ఐటెం సాంగ్ చేస్తుందని ఈ మేరకు ఆమె అడ్వాన్స్ అందుకుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో అసలు తను ఐటెం సాంగ్ చేయడం లేదని అవన్నీ ఫేక్ న్యూస్ లని క్లారిటీ ఇచ్చుకుంది. దీంతో పుష్ప ఐటెం సాంగ్ లో పాయల్ డాన్స్ చేస్తుందనే అంశంపై క్లారిటీ వచ్చింది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్ లో ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.