#Pawan29 ఆ డైరెక్టర్ తోనే?

Sunday,May 03,2020 - 12:39 by Z_CLU

రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్న పవర్ స్టార్ రెండు సినిమాల షూటింగ్స్ కూడా మొదలెట్టేసాడు. ‘వకీల్ సాబ్’ తో పాటే క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేయబోతున్న పవన్.. లేటెస్ట్ గా తన 29వ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసినట్టు టాక్ నడుస్తోంది. కిషోర్ పార్థసాని (డాలీ) డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవర్ స్టార్. వీరిద్దరి కాంబినేషన్ లో ‘గోపాల గోపాల’, ‘కాటమరాయుడు’ సినిమాలొచ్చాయి.

ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు రీమేకే. ఇప్పుడు మూడో సినిమాకి రీమేక్ నే ఎంచుకుంటారా ? లేదా డాలీ సొంత కథతోనే సినిమా చేస్తాడా ? తెలియాల్సి ఉంది.