ఈ మున్నాకు 13 ఏళ్లు

Saturday,May 02,2020 - 04:35 by Z_CLU

స్టయిలిష్ టేకింగ్ అంటే ఎలా ఉంటుంది.. అదిరిపోయే సినిమాటోగ్రఫీ చూడాలనుకుంటున్నారా.. స్టయిల్ ఐకాన్ అనిపించే హీరో ఎలివేషన్స్ కావాలా.. ఇలాంటి వాటన్నింటికీ చాన్నాళ్ల కిందటే డెఫినిషన్ ఇచ్చిన సినిమా మున్నా. సరిగ్గా 13 ఏళ్ల కిందట ఇదే రోజు (మే 2) రిలీజైన ఈ సినిమా వంశీ పైడిపల్లిని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

మున్నా సినిమాను స్టయిలిష్ మూవీగా చెబుతారు. అప్పటివరకు అలాంటి స్టయిలిష్ టేకింగ్ తో సినిమా రాలేదు. అందుకే అప్పట్లో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు వంశీ పైడిపల్లికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

మున్నా ఫుల్ మూవీ కోసం క్లిక్ చేయండి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. గ్లామర్ క్వీన్ శ్రియ ఐటెంసాంగ్ చేసింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమాకి హారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు. వాటిలో “మనసా నువ్వుండే చోటే” పాట అప్పట్లో పెద్ద సంచలనం.