వారణాసి షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పేసిన అజ్ఞాతవాసి టీమ్

Sunday,December 03,2017 - 05:16 by Z_CLU

వారణాసి లో ‘అజ్ఞాతవాసి’ టైటిల్ పోస్టర్ ను రివీల్ చేసిన సినిమా యూనిట్,  కీలక సన్నివేశాలతో పాటు సినిమాలో మాసివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే ఇంట్రడక్షన్ సాంగ్ ని తెరకెక్కించింది. పక్కా ప్లానింగ్ తోఈ షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, హైదరాబాద్ కి తిరిగి వచ్చేసింది.

సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా  త్రివిక్రమ్ స్టైల్ లో ఉండబోయే ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమా ప్రమోషన్  ప్రాసెస్ లోను ఎక్కడా ఈ సినిమా బేసిక్ స్టోరీలైన్ కూడా రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న సినిమా యూనిట్, ఈ నెలాఖరు లోగా ఈ మూవీ ఆడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసే ఆలోచనలో ఉంది.

హారిక & హాసిని బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ తో పాటు అనూ ఇమ్మాన్యువెల్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.