కొత్త సినిమా అనౌన్స్ చేయనున్న రవితేజ

Sunday,December 03,2017 - 03:04 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన ‘రాజా ది గ్రేట్ ’ సినిమాతో మాస్ మహారాజ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న రవితేజ, ప్రస్తుతం ‘టచ్ చేసి చూడు’ సినిమాకు వీలైనంత త్వరలో ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉన్నాడు. విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో వారం రోజుల్లో తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు రవితేజ.

అయితే ఆ మధ్య రవితేజ శ్రీనువైట్ల తో త్వరలో సెట్స్ పైకి రానున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపించింది. దానికి తోడు రీసెంట్ గా రవితేజ కళ్యాణ్ కృష్ణ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాంటప్పుడు ఈ వారం రోజుల్లో రవితేజ అనౌన్స్ చేయనున్న సినిమా ఎవరి డైరెక్షన్ లో ఉండబోతుందా  అనే క్వశ్చన్ ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేస్తుంది.

ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న ‘టచ్ చేసి చూడు’ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు తెలుస్తున్నా, ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.