Shakalaka Shankar నుంచి మరో మూవీ

Sunday,August 23,2020 - 03:23 by Z_CLU

కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్ లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణ లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటెర్టైనెర్ మూవీ కి “బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది” అనే టైటిల్ ఖరారు చేశారు.

ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. అలానే పీఆర్వో ఏలూరు శ్రీను ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించాడు. మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫుల్ కామెడి అండ్ రొమాంటిక్ ఎంటరైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు తెలిపారు.

Shakalaka Shankar నుంచి ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే కామెడి తో పాటు మరి కొన్ని థ్రిల్ ఎలెమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నట్లుగా చెబుతున్నాడు దర్శకుడు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే అర్ధం లో ఎంత ఫన్ ఉందో ఫుల్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది అని చెబుతున్నాడు.