"వలస" బాట పట్టిన దర్శకుడు

Sunday,August 23,2020 - 03:52 by Z_CLU

సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్ లాంటి సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు చేసే సునీల్ కుమార్ రెడ్డి తాజాగా మరో సామజిక అంశాన్ని కథావస్తువుగా ‘వలస’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యక్కలి రవీంద్రబాబు నిర్మాతగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వల్ల రోడ్డున పడ్డ కోట్లాది వలస కూలీల జీవితాన్ని చూపించే ఒక ప్రయత్నం’ వలస ‘.

రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ లాంటి చిత్రాలతో యూత్ కి బాగా దగ్గరైన మనోజ్ నందం, వినయ్ మహాదేవ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో తేజు, గౌరీ లు వారి సరసన హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు