అందుకే అరవింద సమేత అంత గొప్పది – NTR

Monday,October 15,2018 - 12:50 by Z_CLU

దసరా సీజన్ కి పర్ఫెక్ట్ ఫీస్ట్ అనిపించుకుంటున్న ‘అరవింద సమేత’ రోజుకో రికార్డ్ బద్దలు కొట్టే పనిలో ఉంది. ఎక్స్ పెక్టేషన్స్ కి మించి వరల్డ్ వైడ్ గా అప్లాజ్ అందుకుంటుంది ఈ సినిమా యూనిట్. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు ఫిలిమ్ మేకర్స్. అయితే ఈ కార్యక్రమంలో NTR స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ కథని నమ్మిన NTR కి థాంక్స్ చెప్పుకున్న త్రివిక్రమ్ మాటలకు బదులుగా ఆయననుద్దేశించి మాట్లాడిన NTR “నేను  మీ కథని నమ్మినా, నమ్మేటట్టు చేసింది మాత్రం మీరే.  ‘అరవింద సమేత’ అనే త్రివిక్రమ్ జర్నీలో, మేమందరం కలిసి పని చేశాం కానీ, మా జర్నీలో మీరు కలవలేదు. ఇది కంప్లీట్ గా మీ సినిమా’ అని చెప్పుకున్నాడు NTR.

ఈ స్పీచ్ లో భాగంగా ఫస్టాఫ్ లో ఉండే ఫైట్ తరవాత వచ్చే సీక్వెన్స్ ని మరోసారి గుర్తు చేసుకున్నాడు NTR. దర్శకుడు త్రివిక్రమ్ ఆలోచనలకి మరింత పదును పెట్టిన థమన్ ని, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ లను కూడా అభినందించాడు. అరవింద సమేత తన పిల్లలకు కూడా గర్వంగా చూపించుకోగలిగే సినిమా అని చెప్పుకున్నాడు NTR.