కేరళలో ఎన్.టి.ఆర్,సమంత హల్ చల్

Wednesday,August 03,2016 - 01:02 by Z_CLU

జనతా గ్యారేజ్ సినిమాతోనే సమంత తన కెరీర్ ను ఆపేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే ఆమె ఆఖరి ప్రాజెక్టు అని అంతా ఫిక్స్ అయిపోయారు. దీంతో ఎన్టీఆర్-సమంత కాంబోలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ పై అందరి ఫోకస్ పడింది. అటు సమంత కూడా ఈ సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఇఁదులో భాగంగా… సినిమాకు సంబంధించి మరో అదిరిపోయే ఫొటోను నెట్ లో పెట్టింది సమంత. ప్రస్తుతం ఈ ఫొటో నెట్ లో వైరల్ అవుతోంది. జనతా గ్యారేజీకి సంబంధించి ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది. కేరళలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు ఈ షెడ్యూల్ కు సంబంధించి ఎలాంటి పిక్స్ బయటకురాలేదు. తాజాగా సమంత లొకేషన్ స్టిల్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాలతో కలిసి సమంత దిగిన ఈ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కేరళలో ఎన్టీఆర్-సమంత మధ్య ఓ వాన పాటను పిక్చరైజ్ చేస్తున్నారు.