ప్రభాస్ క్లారిటీ ఇచ్చేదెప్పుడో ?

Wednesday,August 03,2016 - 12:34 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బాహుబలి’ (ది కంక్లూజన్). ఈ చిత్రం పూర్తవ్వగానే ప్రభాస్ రెండు సినిమాలు చెయ్యాల్సి ఉంది. అందులో ఒకటి సుజీత్ (‘రన్ రాజా రన్’ ఫేం) దర్శకత్వం లోనూ… మరొకటి రాధాకృష్ణ (‘జిల్’ ఫేం) దర్శకత్వంలో చేయాల్సి ఉంది. మొదటి చిత్రంతో విజయం అందుకొన్న ఈ ఇద్దరు దర్శకులు ప్రభాస్ కోసం రెండేళ్ల నుండి ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు చెప్పిన కథలకు ‘బాహుబలి’ (ది బిగినింగ్) సమయం లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ప్రభాస్. ఇక పార్ట్ 2 తరువాత సుజీత్ సినిమాకు షిఫ్ట్ అయ్యి ఆ తరువాత రాధాకృష్ణ సినిమాకు షిఫ్ట్ అవుతాడనే టాక్ మొన్నటి వరకూ వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా ప్రభాస్ బాహుబలి ది కంక్లూజన్ తరువాత రాధాకృష్ణ సినిమా కు జాయిన్ అవ్వనున్నాడనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. దీంతో ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం లో పడ్డారు. రాధాకృష్ణ కంటే ముందునుంచే వెయిట్ చేస్తున్న సుజీత్ కు ప్రభాస్ ఎందుకు తొలి అవకాశం ఇవ్వలేదంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ ఇద్దరిలో ఏ దర్శకుడితో కలిసి ప్రభాస్ సెట్స్ పైకి వెళతాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.