NTR Corona - కరోనా నుంచి కోలుకున్న యంగ్ టైగర్

Tuesday,May 25,2021 - 04:21 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రీసెంట్ గా టెస్టులు చేయగా.. తారక్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ఎనౌన్స్ చేశాడు. తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని ప్రకటించాడు.

ఈనెల 10న ఎన్టీఆర్ కు వైరస్ ఎఫెక్ట్ అయింది. ఆ విషయాన్ని ట్విట్టర్ లో ఎనౌన్స్ చేసిన తారక్, ఆ వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు. కిమ్స్ కు చెందిన డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉన్నాడు. ముందుజాగ్రత్తగా తారక్ కుటుంబ సభ్యులందరికీ టెస్టులు నిర్వహించారు.

అలా 2 వారాలుగా ఐసొలేషన్ లో ఉన్న ఎన్టీఆర్, వైరస్ నుంచి పూర్తిగా బయటపడ్డాడు. తను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ థ్యాంక్స్ చెప్పాడు ఎన్టీఆర్. డాక్టర్లకు కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు.

NTR RRR zeecinemalu

బాధాకరమైన విషయం ఏంటంటే.. సరిగ్గా తారక్ ఐసొలేషన్ లో ఉన్నప్పుడే అతడి బర్త్ డే వచ్చింది. తన ప్రతి బర్త్ డేకు పిల్లలతో కలిసి కేక్ కట్ చేయడం ఎన్టీఆర్ కు అలవాటు. ఈ ఏడాది ఆ అవకాశం లేకుండా పోయింది. అటు ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ క్వారంటైన్ లో ఉండడంతో సంబరాలకు దూరంగా ఉన్నారు. అయితే ఉన్నంతలో RRR Movie నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ రావడంతో అంతా కాస్త సంతోషపడ్డారు.

ప్రస్తుతం యంగ్ టైగర్ చేతిలో RRR మూవీతో పాటు కొరటాల సినిమా ఉంది. దీంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో.. ఎప్పుడు షూటింగ్స్ మొదలైతే అప్పుడు వెంటనే సెట్స్ పైకి రావడానికి రెడీ అన్నమాట.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics