Boyapati - నెక్స్ట్ ఏంటి?

Tuesday,May 25,2021 - 03:47 by Z_CLU

ప్రస్తుతం బాలయ్య తో బోయపాటి శ్రీను ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తయింది. ఫైనల్ షెడ్యుల్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. లాక్ డౌన్ ఎత్తివేసి షూటింగ్స్ కి పర్మీషణ్ ఇవ్వగానే మిగిలిన షూట్ పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టేజిలో ఉండగానే రెండు స్క్రిప్ట్స్ రెడీ చేసి హీరోలకి వినిపించాడట బోయపాటి.

sarrainodu-allu-arjun-zeecinemalu

‘సరైనోడు’లో అల్లు అర్జున్

అవును ఇటివలే అల్లు అర్జున్, రవితేజ ఇద్దరికీ రెండు కథలు చెప్పి లాక్ చేసుకున్నాడట బోయపాటి. అయితే ఇద్దరిలో ముందుగా బోయపాటి ఎవరితో సినిమా చేస్తాడనేది మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. దీనికి రీజన్ ఇద్దరు హీరోలు ఫుల్ బిజీగా ఉన్నారు. రవితేజ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తయ్యాకే బోయపాటి సినిమా మొదలు పెడతాడు రవితేజ. ఈ ఇద్దరి కాంబోలో గతంలో ‘భద్ర’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతోనే బోయపాటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక అల్లు అర్జున్ తో సరైనోడు అనే మాస్ యాక్షన్ సినిమా చేసిన బోయపాటి మళ్ళీ అల్లు అర్జున్ కి అలాంటి ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ చెప్పాడట.

bhadra raviteja zeecinemalu

‘భద్ర’ సినిమాలో రవితేజ

‘పుష్ప’ షూట్ ఫినిష్ చేశాక కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడని అంటున్నారు. అలాగే బన్నీ లిస్టులో కూడా ఇంకా కొందరు డైరెక్టర్స్ ఉన్నారు. మరి వారిని పక్క్కన పెట్టి బన్నీ పుష్ప తర్వాత బోయపాటి కి అవకాశం ఇస్తాడా అనేది తెలియాలి. ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ తర్వాత తనకి కలిసొచ్చిన బాలయ్య తో ‘అఖండ’ తీస్తున్న బోయపాటి ఈ సినిమాతో భారీ హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టి ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు బోయపాటి. మరి ఈ అఖండ తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics