NTR Prashanth Neel - పొలిటికల్ డ్రామా?

Wednesday,June 02,2021 - 02:18 by Z_CLU

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో లో సినిమా ఎనౌన్సయినప్పటి నుండి ఈ క్రేజీ కాంబో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. KGF లో యష్ ని ఒక రేంజ్ లో చూపిస్తూ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఎట్రాక్ట్ చేసిన ప్రశాంత్ ఇప్పుడు తారక్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడా ? ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే సినిమా గురించి ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ntr prashanth neel movie announcement zeecinemalu 1

దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్

ప్రస్తుతం #NTR31 గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ బయటికొచ్చింది. సినిమాలో తారక్ పోలిటిషియన్ గా కనిపించనున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో రూపొందనున్న ఈ సినిమా త్రివిక్రమ్- తారక్ చేయనున్న #NTR30 తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు ప్రశాంత్ నీల్ చేతిలో ఉన్న ప్రభాస్ సినిమాను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇద్దరూ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి తమ కాంబో సినిమాను మొదలు పెట్టనున్నారు.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయింది. సినిమా రాజకీయ నేపథ్యంలో సాగే కథతో పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని తెలుస్తుంది. తారక్ ఎప్పటి నుండో ఓ పొలిటికల్ డ్రామా సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని కథలు కూడా విన్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ చెప్పిన పొలిటికల్ కాన్సెప్ట్ కి ఓకె చెప్పాడని తెలుస్తుంది. ఏదేమైనా తారక్ నుండి ఓ పొలిటికల్ సినిమా రానుందని , అది పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేస్తాడని ప్రచారంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ఇదే నిజమైతే ఈ సినిమాకు రాజకీయ పరంగానూ భారీ హైప్ రావడం ఖాయం.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics