Sukumar Vijay Movie - మరో ఇంట్రెస్టింగ్ బజ్

Wednesday,June 02,2021 - 02:08 by Z_CLU

ప్రెజెంట్ అల్లు అర్జున్ తో ‘పుష్ప’ ప్రాంచైజీ చేస్తున్న సుకుమార్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటివలే ఈ సినిమాను ఎనౌన్స్ చేసి త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని ఎనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ క్రేజీ కాంబో సినిమాపై తాజాగా ఓ ప్రచారం జరుగుతుంది.

సినిమా తెలంగాణా నేపథ్యంలో ఉంటుందని, విజయ్ పక్కా తెలంగాణ కుర్రాడిగా కనిపిస్తాడని అంటున్నారు. ఎప్పటి నుండో సుకుమార్ కి తెలంగాణా నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఉంది. అలాగే అర్జున్ రెడ్డి చూశాక విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు సుక్కు.

Sukumar_Vijay_Deverakonda_Movie_a_Love_Story-సుకుమార్-విజయ్_దేవరకొండ

అందుకే తన స్టైల్ లో ఓ కథ రాసుకున్నాడు. దానికి తెలంగాణ యాసతో మరింత అందం తీసుకొచ్చే విజయ్ హీరో అయితే సినిమా ఓ రేంజ్ కెళ్తుందని నమ్మాడు. అందుకే డైరెక్ట్ గా కథను విజయ్ దగ్గరికి తీసుకెళ్ళాడు సుకుమార్. స్క్రిప్ట్ నచ్చడం, పైగా సుకుమార్ సినిమా కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు విజయ్. ప్రస్తుతం సుక్కు-విజయ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

కొత్త కథలతో హీరోలను సరికొత్తగా చూపించే సుకుమార్ విజయ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడు? ఎలాంటి కథతో సినిమా చేయబోతున్నాడు అనే ప్రశ్నలో ఆడియన్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు సుక్కు. విజయ్ లైగర్ పూర్తి చేసే లోపు సుక్కు పుష్ప రెండు భాగాలను కంప్లీట్ చేస్తాడు. ఇద్దరూ ఫ్రీ అవ్వగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది.

ఇప్పటికే కథకు తగిన తెలంగాణలో కొన్ని లోకేషన్స్ ఫైనల్ చేసుకున్నారట సుక్కు అండ్ టీం. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద మ్యూజిక్ అందివ్వనున్నాడు. విజయ్ -దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో రాబోతున్న ఈ ఆల్బంపై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఫాల్కన్ క్రియేషన్స్ బేనర్ పై కేదార్ సెలగమ శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ మిగతా కాస్టింగ్ ఫైనల్ కావల్సి ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics