NTR Koratala Movie - మ్యూజిక్ ఎవరు?

Monday,May 24,2021 - 07:37 by Z_CLU

తాజాగా కొరటాల శివ -ఎన్టీఆర్ కాంబోలో ఎనౌన్స్ అయిన #NTR30 కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇవ్వనున్నాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజానికి ఎన్టీఆర్ అనిరుద్ కాంబో ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాకు ముందు అనిరుద్ నే అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ కొన్ని రీజన్స్ వల్ల తమన్ ని పెట్టుకున్నాడు.

anirudh zeecinemalu

సంగీత దర్శకుడు అనిరుధ్

అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కాంబో ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. కొరటాల తో ఇటివలే డిస్కషన్ లో పాల్గొన్న తారక్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని సజిస్ట్ చేశాడని ఈసారి ఇద్దరూ కలిసి ట్రెండీ మ్యూజిక్ తో మాంచి మాస్ సాంగ్స్ అందించే అనిరుద్ కే ఓటేశారని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు కీయరా ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. త్వరలోనే ఈ రెండు విషయాలపై పూర్తి క్లారిటీ రానుంది.

తారక్ ‘RRR’ కొరటాల శివ ‘ఆచార్య’ షూట్ పూర్తి చేయాల్సి ఉంది. ఆ రెండు సినిమాల షూటింగ్ పూర్తవ్వగానే ఈ కాంబో సినిమా సెట్స్ పైకి వస్తుంది. జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ , కొరటాల ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో నాలుగు భాషల్లో పెద్ద విజయం అందుకోవాలని చూస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్స్ పై రూపొందనున్న ఈ సినిమాకు మిక్కిలినేని సుధాకర్ , కళ్యాణ్ రామ్ నిర్మాతలు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics