NTR - ఆ దర్శకుడికి చాన్స్ ఇచ్చేదెపుడు?

Friday,May 21,2021 - 01:42 by Z_CLU

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి RRR సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ కొరటాల శివతో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 టైటిల్ తో సినిమా ఎనౌన్స్ చేసిన కొన్ని రోజులకే ప్రశాంత్ నీల్ తో #NTR31 సినిమా కన్ఫర్మ్ చేశాడు తారక్. నిన్న తారక్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ లిస్టులో ఉన్న బుచ్చిబాబు సినిమా ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అవును కొన్ని రోజుల క్రితం తారక్ కి స్క్రిప్ట్ చెప్పాడు బుచ్చిబాబు. ‘ఉప్పెన’ రిలీజ్ అవ్వగానే ఎన్టీఆర్ ని కలిసి రెండు సార్లు నెరేషన్స్ ఇచ్చాడు. ఫైనల్ నెరేషన్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు బుచ్చిబాబు. తారక్ కి బుచ్చి ఫైనల్ నెరేషన్ ఇచ్చిన వెంటనే మేకర్స్ ఆ సినిమాను ప్రకటిస్తారు.

NTR-to-team-up-with-buchibabu

ఇక నిన్న ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ “లోకల్ కథను గ్లోబల్ లెవెల్ లో చెప్పి ట్రెండ్ క్రియేట్ చేద్దాం. వెయిటింగ్ sir”అంటూ ట్వీట్ వేశాడు. బుచ్చి వేసిన ఈ ట్వీట్ తో #NTR32 పై కూడా అభిమానులకి ఓ క్లారిటీ వచ్చేసింది. కొరటాల , ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ బుచ్చిబాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి వివిధ రకాల ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనుందని , ఇందులో ఎన్టీఆర్ స్పోర్ట్స్ మెన్ గా కనిపిస్తాడని వినబడుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics