Bangarraju - అదిగో వచ్చేస్తున్నాడు!

Friday,May 21,2021 - 06:28 by Z_CLU

‘సోగ్గాడు చిన్ని నాయన’ కి సీక్వెల్ గా నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి రానుందని ప్రచారం మొదలైంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ వచ్చే సంక్రాంతి కి ‘బంగార్రాజు’ అంటూ పోస్టులు పెట్టుకుంటున్నారు. నిజానికి ‘బంగార్రాజు’ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయి చాలా నెలలవుతుంది. కాకపోతే సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతూ ఎప్పటికప్పుడు కొత్త ప్రచారంతో ముందుకు వెళ్తుంది.

అయితే లేటెస్ట్ గా ఈ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు నాగార్జున. సినిమా షూటింగ్ ఏడాది చివరి లోపు ఫినిష్ చేయగలిగితేనే మొదలు పెడతానని లేదంటే వచ్చే సంక్రాంతికి సినిమా ఉంటుందని. ఆ సినిమా ఎప్పుడు పూర్తయిన థియేటర్స్ లోకి మాత్రం సంక్రాంతి కే రానుందని అన్నాడు. దీంతో జులై నుండి నాగార్జున ఈ సీక్వెల్ షూట్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడని , వచ్చే సంక్రాంతి కి సినిమా రిలీజ్ ఉంటుందనే టాక్ గట్టిగా వినబడుతుంది.

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నాగార్జున నటించనున్న ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఓ క్యారెక్టర్ చేయనున్నాడు. సినిమాలో నాగార్జున తనయుడిగా చైతు కనిపిస్తాడని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాపై నాగ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సోగ్గాడు చిన్న నాయన రేంజ్ లో మళ్ళీ మంచి వసూళ్ళు రాబట్టే సత్తా ఉందని స్క్రిప్టింగ్ స్టేజిలో నమ్మకం పెట్టుకున్నాడు. మరి చూడాలి ఈ సీక్వెల్ నిజంగా వచ్చే సంక్రాంతి కి వస్తుందా ? మళ్ళీ నాగార్జున కి ఓ బ్లాక్ బస్టర్ అందిస్తుందా ?

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics