వేట బిగిన్ అయింది

Wednesday,March 15,2017 - 04:33 by Z_CLU

యంగ్ టైగర్ హంటింగ్ మొదలైంది. జనతా గ్యారేజ్ తరవాత బ్రేక్ తీసుకుని మరీ ఫైనల్ చేసుకున్న డైరెక్టర్ బాబీ వెంచర్ తో సెట్స్ పైకి వచ్చేశాడు NTR. ఈ సినిమా సెట్స్ పైకి కూడా రాకముందే సినిమాకి కీ బ్యాక్ బోన్ లా పని చేయనున్న టెక్నీషియన్స్ దగ్గర్నించి, హీరోయిన్ వరకు ప్రతీది అప్ డేట్ చేసిన సినిమా యూనిట్ బిగినింగ్ నుండే కావాల్సినంత కాన్సంట్రేషన్ ని కలెక్ట్ చేసేసింది.

ఫిబ్రవరి 9 న లాంచ్ అయిన ఈ సినిమా NTR మూడు డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో ఎంటర్ టైన్ చేయనున్నాడనే టాక్ టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది. రాశిఖన్నాని ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయిన సినిమా యూనిట్, మరో హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే ప్రాసెస్ లో ఉంది.

 

ఒక క్యారెక్టర్ లో సిక్స్ ప్యాక్ తో ఎట్రాక్ట్ చేయనున్న NTR మరో క్యారెక్టర్ లో ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించని విధంగా సరికొత్త లుక్ తో మెస్మరైజ్ చేయనున్నాడు. సెట్స్ పైకి వెళ్ళడమే కాస్త లేట్, ఒక్కసారి యాక్షన్ బిగిన్ అయితే ప్యాకప్ చెప్పేదాకా నిద్రపోయే అలవాటు లేని NTR సినిమా సెట్స్ పైకి వచ్చేసింది అనగానే, ఏకంగా సినిమా రిలీజయిందనే లెవెల్లో రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.