కాటమరాయుడి రూట్ క్లియర్

Wednesday,March 15,2017 - 06:00 by Z_CLU

24 మార్చ్ కి కౌంట్ డౌన్ బిగిన్ అయింది. కాటమరాయుడు రిలీజ్ డేట్ రోజురోజుకి టాలీవుడ్ లో హీట్ ని పెంచేస్తుంది. ఈ లోపు పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ క్లియరెన్స్ లాంటి ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డ సినిమా యూనిట్, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అల్టిమేట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘కాటరాయుడు’ కి క్లీన్ U సర్టిఫికెట్ పొందింది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన కరియర్ లోనే ఫస్ట్ టైం నలుగురు తమ్ముళ్ళకు అన్నయ్యల్లా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా రిలీజైన 3 సింగిల్స్ ఆల్ రెడీ క్రియేట్ అయిన హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ని ఏకంగా పీక్ స్టేజ్ కి తీసుకువెళ్ళాయి.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా కిషోర్ కుమార్ పార్దసాని డైరెక్షన్ లో తెరకెక్కింది. మార్చి 18 న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకోనున్న కాటమరాయుడు టీమ్, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సినిమాలో అజయ్, కమల్ కామరాజు, శివ బాలాజీ, కృష్ణ చైతన్య పవన్ కళ్యాణ్ కి తమ్ముళ్ళుగా నటించారు.