ఈసారి హీరో తమ్ముడు కాదు..

Saturday,July 20,2019 - 10:02 by Z_CLU

హీరోల తమ్ముళ్ళు కూడా హీరోలవ్వడం తెలుగు సినిమాకి కొత్తేం కాదు. అల్లు శిరీష్ నుండి బిగిన్ అయితే ఇప్పుడు సెట్స్ పై ఉన్న సాయి ధరమ్ తేజ్ తమ్ముడి వరకు అందరికీ పరిచయమే. అయితే ఈ సారి హీరో తమ్ముడు కాదు.. హీరోయిన్ తమ్ముడు హీరోయిన్ తమ్ముడుగా పరిచయమవుతున్నాడు. ఇది కొంచెం కొత్తే… 

రకుల్ ప్రీత్ తమ్ముడు అమాన్ ప్రీత్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అయితే అమాన్ ఫస్ట్ సినిమాకి అదృష్టం ఎంతగా కలిసొచ్చిందంటే నాగార్జున బ్లాక్ బస్టర్  సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా టైటిల్ కూడా దొరికింది. దీన్ని స్వయంగా నాగార్జున లాంచ్ చేయడంతో, రకుల్ ప్రీత్ తమ్ముడు అనే ఒక్క రీజన్ పక్కన పెడితే, కనీసం మొహం కూడా తెలియని ఈ కుర్రాడు సెట్స్ పై ఉండగానే హీరో అయిపోయాడు. 

రకుల్ ప్రీత్ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్.. అనుమానం లేదు.. సౌత్ ఒక్కటేనా..? ఏకంగా బాలీవుడ్ లో అదే రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని గట్టిగానే ట్రై చేస్తుంది. అయితే తమ్ముడు అమాన్ ప్రీత్ మాత్రం తెరంగేట్రం తోనే ఇటు టాలీవుడ్ ని అటు బాలీవుడ్ ని టార్గెట్ చేసుకున్నాడు.

 

ఈ సినిమాలో CIA ఏజెంట్ గా కనిపించబోతున్నాడట. తెలుగు టైటిల్ చూస్తే ‘నిన్నే పెళ్ళాడతా’. ఈ రెండినిని బట్టి సినిమా డెఫ్ఫినెట్ గా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపిస్తుంది. చూడాలి మరీ ఈ తమ్ముడి సినిమాకి రకుల్ మ్యాజిక్ ఎంతవరకు పని చేస్తుందో…