SPY Trailer గ్రాండియర్ విజువల్స్ & ఇంట్రెస్టింగ్

Friday,June 23,2023 - 10:11 by Z_CLU

హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యమీనన్ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’ థియేట్రికల్ ట్రైలర్‌  రిలీజైంది. గురువారం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. స్వాతంత్ర  సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండడంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఇప్పుటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రతి భారతీయుడికి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. సాంకేతికంగా, యుద్ధ సన్నివేశాల పరంగా సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉండబోతోందో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిఖిల్ యాక్షన్‌కు తోడు దగ్గుబాటి రానా కూడా ట్రైలర్‌ చివర్లో కనిపించడంతో ప్రేక్షకుల్లో అతని పాత్ర పై క్యూరియాసిటీ రైజ్ చేస్తుంది. ‘స్వతంత్రమంటే ఎవరో ఇచ్చేది కాదు.. మనం లాక్కుంటే వచ్చేది’ అంటూ ట్రైలర్ ఎండింగ్‌‌లో రానా చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

ఓవరాల్ గా ట్రైలర్ తో నిఖిల్ స్పై పై అంచనాలు నెలకొల్పాడు. నేటి నుండి పాన్ ఇండియా ప్రమోషన్స్ తో నిఖిల్ అండ్ టీం బిజీ అవ్వనున్నారు. ముంబై , బెంగళూర్ , చెన్నై తో పాటు ఆంధ్రా , తెలంగాణ లో కూడా ఈవెంట్స్ నిర్వహించనున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29 న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.