నిఖిల్ కొత్త సినిమా లాంఛ్

Friday,October 19,2018 - 03:28 by Z_CLU

దసరా సందర్భంగా కొత్త సినిమా లాంఛ్ చేశాడు నిఖిల్. కేవలం సినిమాకు కొబ్బరికాయ కొట్టి ఊరుకోలేదు. తన సినిమా టైటిల్ పోస్టర్ ను కూడా లాంఛ్ చేశాడు. అవును.. నిఖిల్ కొత్త సినిమా పేరు శ్వాస. ఈరోజు ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది.

రెడ్ స్కై ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కొత్త నిర్మాతలు తేజ్ అప్పలపాటి, హరి నికేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో కిషన్ కట్టా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ ఓపెనింగ్ కు శర్వానంద్, క్రిష్, నరేష్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. శర్వానంద్ క్లాప్ కొట్టాడు.

ఈ సినిమాలో నిఖిల్ సరసన నివేత థామన్ హీరోయిన్ గా నటించనుంది. ఓపెనింగ్ కు ఆమె కూడా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాకు సంగీత దర్శకుడు ఎవరనే విషయాన్ని ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు.