ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

Friday,October 19,2018 - 02:32 by Z_CLU

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో త‌మ‌న్నా ప‌ద‌హార‌ణాల తెలుగ‌మ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది. ప్ర‌తిష్టాత్మ‌క ఐఫిల్ ట‌వ‌ర్ నేప‌థ్యంలో ఈ క‌థ సాగుతుంది.

అమాయ‌కంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఎలా శ‌క్తివంత‌మైన మ‌హిళగా మారుతుంది అనేది ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి క‌థ‌. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. మైఖెల్ ట‌బూరియ‌స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

తైజాన్ ఖొరాకివాలా ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌గా.. మీడియెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ లో మ‌ను కుమ‌రన్ నిర్మాణంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది ఈ చిత్రం. త్వ‌ర‌లోనే ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌యూనిట్.