NTR Prashanth Neel Movie - వాళ్లిద్దరూ ఫిక్స్?

Tuesday,June 08,2021 - 03:04 by Z_CLU

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం RRR సినిమాలో నటిస్తున్న తారక్ నెక్స్ట్ కొరటాల శివతో #NTR30 సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో #NTR31 సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఇటివలే ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రకటనతో పండగ చేసుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి వర్క్ మొదలు పెట్టాడని తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనల్ చేసుకున్నాడని ఇన్సైడ్ టాక్.

ప్రశాంత్ డైరెక్ట్ చేస్తున్న KGF2 తో పాటు SALAAR సినిమాకు కూడా రవి బశ్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక తారక్ సినిమాను కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా రవినే రిపీట్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ సినిమాకు ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట ప్రశాంత్. అనిరుద్ పేరు సూచించింది ఎన్టీఆర్ అని టాక్ వినబడుతుంది. అనిరుద్ తో ఎప్పటి నుండి సినిమా చేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. అరవింద సమేత కి ముందుగా అనిరుద్ నే అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ కొన్ని కారణాల వల్ల తమన్ ని తీసుకున్నాడు.

అందుకే ఈసారి తన సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఉండాల్సిందే అని ఫీలయ్యాడట తారక్. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా కీయరా అద్వాని ఫైనల్ చేసారనే టాక్ కూడా వినబడుతుంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం #NTR30 కి సంబంధించి అనిరుద్ , కీయరా ఇద్దరూ ఫిక్స్ అని గట్టిగా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి ఇందులో నిజమెంతో ?

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics