అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న నెపోలియన్

Wednesday,August 16,2017 - 06:35 by Z_CLU

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కొత్త కథలొస్తున్నాయి. సరికొత్త ప్రయోగాలు తెరపైకి వస్తున్నాయి. సరిగ్గా ఇదే కేటగిరీకి చెందిన సినిమా నెపోలియన్. సినిమాలో హీరోకు నీడ ఉండదు. వినడానికి కాస్త కొత్తగా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ స్టోరీలైన్ ఇదే. పుట్టినప్పట్నుంచి తనతోనే ఉన్న నీడ ఈమధ్య కాలంలో కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు హీరో. ఇక అక్కడ్నుంచి కథ మొదలవుతుంది. దీనికి ఓ సామాజిక కోణాన్ని, చిన్న సందేశాన్ని కూడా జోడించాడు దర్శకుడు ఆనంద్ రవి. ఈ సినిమా స్టోరీ రాసింది ఇతడే. హీరోగా నటించింది కూడా ఇతడే.

గతంలో ప్రతినిథి, కేవో2 లాంటి సినిమాలకు కథలు అందించిన ఆనంద్ రవి, కాస్త గ్యాప్ తీసుకొని రాసుకున్న కథే నెపోలియన్. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ ను హీరో సందీప్ కిషన్ లాంచ్ చేశాడు. ఆనంద్‌ రవి, కోమలి, రవివర్మ, కేదార్‌ శంకర్‌, మధుమణి, అల్లు రమేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, మ్యూజిక్‌: సిద్ధార్థ్‌ సదాశివుని, సినిమాటోగ్రఫీ: మార్గల్‌ డేవిడ్‌, పాటలు: బాలాజీ, ఆర్ట్‌: బాబ్జి, నిర్మాత: భోగేంద్ర గుప్తా మడుపల్లి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆనంద్‌ రవి.