మిలియన్ క్లబ్ కు కాస్త దూరంలో...

Saturday,February 11,2017 - 10:34 by Z_CLU

నాని నటించిన నేను లోకల్ సినిమా బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో ప్రారంభమైన ఈ సినిమా.. వసూళ్లలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన నేను లోకల్ సినిమా… వీకెండ్ వసూళ్లలో కూడా ది బెస్ట్ అనిపించుకుంది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా మిలియన్ క్లబ్ లోకి చేరడానికి రెడీగా ఉంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి అమెరికాలో ఈ సినిమా 8లక్షల51వేల డాలర్లు ఆర్జించింది. ఇదే ఊపు ఈ వీకెండ్ కూడా కొనసాగే అవకాశాలున్నాయి. సో… 10లక్షల డాలర్లు కొల్లగొట్టడం నానికి పెద్ద కష్టమైన పనేంకాదు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా నేను లోకల్ సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల 75లక్షల రూపాయల షేర్ వచ్చింది. నాని కెరీర్ లో ఫస్ట్ వీక్ లోనే  ఇంత కలెక్షన్ రాబట్టిన సినిమా నేను లోకల్ మాత్రమే. అటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా 18కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నాని-కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. మూవీలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.