Neha Shetty - రూల్స్ రంజన్ తో రొమాన్స్

Thursday,June 16,2022 - 12:56 by Z_CLU

Neha Shetty in Kiran Abbavaram’s Rules Ranjan

ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా సక్సెస్ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా రూల్స్ రంజన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఎ.యం.రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ సంయుక్తంగా స్టార్ లైట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ నడుస్తోంది. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన నటీనటులు పాల్గొంటున్నారు.

ఇప్పుడీ సినిమాకు హీరోయిన్ ను లాక్ చేశారు. డీజే టిల్లూ ఫేమ్ నేహా శెట్టి, రూల్స్ రంజన్ సరసన హీరోయిన్ గా మెరవనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎస్ఆర్ కళ్యాణ మండపంతో కిరణ్ అబ్బవరం, డీజే టిల్లు తో నేహా శెట్టి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘రూల్స్ రంజన్’ చిత్రంలో నటించనుండటంతో సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చింది.

డీజే టిల్లూ తర్వాత వరుసపెట్టి అవకాశాలు అందుకుంటోంది నేహా శెట్టి. కుర్రహీరోలకు ఆమె క్రేజీ ఆప్షన్ గా మారింది. ఇందులో భాగంగా ఇప్పటికే 3 సినిమాలకు ఓకే చెప్పిన ఈ టిల్లూ భామ, ఇప్పుడు కిరణ్ అబ్బవరం సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics