Sammathame - మరో సినిమా రెడీ చేసిన కిరణ్

Thursday,June 16,2022 - 05:33 by Z_CLU

Sammathame to release on June 24

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం “సమ్మతమే”. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. థియేట్రికల్ ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ, ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. దీంతో సినిమా అన్ని ప్రాంతాలలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్. విడుదలకు ముందే ‘సమ్మతమే’ పాజిటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంటోంది. టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది.

గోపీనాథ్ రెడ్డి ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సతీష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics