CUSTODY Movie చైతు ఫస్ట్ లుక్ పోస్టర్
Wednesday,November 23,2022 - 03:01 by Z_CLU
NC 22 titled “CUSTODY”, Naga Chaitanya fighting against all odds in the first look
అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) , వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్ లో బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ శుభకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. “కస్టడీ” (CUSTODY) అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు.
నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ “ఎ. శివ” పాత్రలో, అతను చూడాలనుకునే మార్పు కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడే కథతో సినిమా తెరకెక్కుతుంది. శివ తాను నమ్మే విధానం కోసం తన స్వంత వ్యవస్థతో పోరాటం చేస్తాడని ఫస్ట్ లుక్ లో స్పష్టమౌతోంది.

క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్యని పూర్తిగా కొత్త అవతార్ లో ప్రజంట్ చేయబోతున్నాడు. ‘కస్టడీ’ కి ‘ఎ వెంకట్ ప్రభు హంట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు. ‘మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఈ సినిమాలో చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా , విలన్ గా అరవింద్ స్వామి , పవర్ ఫుల్ పాత్రలో ప్రియమణి కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, ఎస్‌ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బేనర్ పై చితూరి శ్రీనివాస్ భారీ బడ్జెట్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics