నవీన్ చంద్ర హీరోగా "మిషన్ 2020"

Monday,August 31,2020 - 03:55 by Z_CLU

బన్నీ క్రియేషన్స్, మధు మృదు ఎంటర్టైన్మెంట్ స్ పతాకం పై నవీన్ చంద్ర హీరో గా యదార్ధ సంఘటనల ఆధారంగా, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా “మిషన్ 2020”. గతంలో శ్రీకాంత్ హీరో గా రాజకీయ నేపథ్యంతో విడుదలైన మెంటల్ పోలీస్, ఆపరేషన్ 2019 సినిమాలు ఘన విజయం సాధించాయి. ఆ రెండు సినిమాలకి కరణం బాబ్జి దర్శకుడు. అతడే ఇప్పుడు మిషన్ 2020 కూడా తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేసారు.

దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ “జనవరిలో షూటింగ్ మొదలు చేసాం. మార్చి లాక్ డౌన్ కి పూర్తి చేసాం. నవీన్ చంద్ర అంకిత భావం తో పని చేసారు. నిన్న రాత్రి శ్రీ రాపాక తో ఐటమ్ సాంగ్ పూర్తీ చేసాము. చాలా బాగా వచ్చింది. ఈ 2020 లో ఆ పాట సెన్సేషన్ అవుతుంది” అని తెలిపారు.