వేదాంతం రాఘవయ్యగా సునీల్

Monday,August 31,2020 - 03:46 by Z_CLU

సునీల్ హీరోగా 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై ‘వేదాంతం రాఘ‌వ‌య్య’ అనే చిత్రాన్ని నిర్మించేందుకు రామ్ ఆచంట‌, గోపి ఆచంట స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇదే బ్యాన‌ర్‌లో ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందించిన డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రానికి క‌థ‌ను అందించ‌డ‌మే కాకుండా, చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌టం విశేషం.

టైటిల్ విన‌గానే ప్లెజెంట్‌గా, మంచి ఇంప్రెష‌న్ క‌లిగిస్తోంది. త్వ‌ర‌లో మ‌రికొన్ని వివ‌రాలను చిత్ర బృందం ప్ర‌క‌టించ‌నున్న‌ది.

హీరో: సునీల్‌
క‌థ‌, స‌మ‌ర్ప‌ణ‌: హ‌రీష్ శంక‌ర్‌
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపి ఆచంట‌
బ్యాన‌ర్‌: 14 రీల్స్ ప్ల‌స్‌