"హీరో హీరోయిన్" వస్తున్నారు

Saturday,December 07,2019 - 11:47 by Z_CLU

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హీరోహీరోయిన్. నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సినిమాల పైరసీ నేపథ్యంలో సాగే కథ కావడంతో ప్రతీ ప్రేక్షకుడు ఈ టీజర్ కు బాగా కనెక్ట్ అయ్యారు. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్.

నటీనటులు
నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, డింపుల్ చొపాడియా, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృథ్వి, అభిమన్యుసింగ్, జయప్రకాశ్, గౌతమ్ రాజు, శివన్నారాయణ, బమ్ చిక్ బబ్లూ మొదలగువారు

సాంకేతిక నిపుణులు
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె,
కెమెరా: వెంకట్ గంగాధరీ,
ఎడిటర్: జునైద్ సిద్ధికి,
ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె
ఫైట్స్ – రియల్ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వంశీ కృష్ణ
నిర్మాత: భార్గవ్ మన్నె,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి