శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా ప్రారంభం

Saturday,December 07,2019 - 11:40 by Z_CLU

శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి. నిర్మిస్తున్న చిత్రం ప్రారంభమైంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు  టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్.

ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు డ్రామా ఉంటుందని అంటున్నాడు దర్శకుడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ఉంటుంది. సినిమాకు సంగీతం వివేక్ సాగర్, ఛాయాగ్రహణం వేదరామన్.