bedurulanka Teaser విలేజ్ కామెడీ డ్రామా

Friday,February 10,2023 - 06:11 by Z_CLU

కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న ‘బెదురులంక 2012’ (Bedurulanka Movie  ) టీజర్ రిలీజైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచేసింది. బెదురులంక అనే పల్లెటూరిలో 2012 యాగాంతం కథతో తెరకెక్కిన కామెడీ డ్రామా అని టీజర్ తో క్లియర్ గా చెప్పేశారు మేకర్స్. పల్లెటూరిలో పాత్రలు వాటి బిహేవియర్ తో సినిమాలో మంచి వినోదం అందనుందని అర్థమవుతుంది. యుగాంతం వస్తుందా ? అందరం చనిపోతామా ? అనే భయంలో ఉన్న జనాలు వాళ్ళ భయంతో ఆడుకునే కొందరు వ్యక్తులతో సినిమాలో మంచి డ్రామా ఉండనుంద నిపిస్తుంది.

టీజర్ లో కార్తికేయ లుక్ , కేరెక్టర్ ఆకట్టుకున్నాయి. అలాగే నేహా శెట్టి కూడా సినిమాకు తన గ్లామర్ తో ప్లస్  అవ్వనుందని కొన్ని సీన్స్ చూస్తే తెలుస్తుంది. కామెడీ , రొమాన్స్ ,  కేరెక్టర్స్ , విలేజ్ డ్రామాతో టీజర్ ఆసక్తిగా సాగింది. దర్శకుడు క్లాక్స్ ఈ సినిమాతో మనకి తెలిసిన విషయన్నే కాస్త కొత్తగా సరదాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఓవరాల్ గా బెదురులంక 2012 టీజర్ పర్ఫెక్ట్ కట్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేస్తూ అంచనాలు పెంచేస్తుంది. లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చ్ లో థియేటర్స్ లోకి రానుంది.